స్వచ్ఛత ఆచరణలో చూపాలి : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : స్వచ్ఛత ఆచరణలో చూపుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్-21లో సిద్దిపేటను అగ్రభాగంలో నిలపాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు. కేసీఆర్ నగర్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో భాగంగా పట్టణ పరిశుభ్రత - ప్రతి ఒక్కరి కర్తవ్యం పేరుతో.. స్వచ్ఛ రంగవల్లులు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్వచ్ఛతపై భిన్న కాన్సెప్ట్ లతో వేసిన రంగవల్లులను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. రంగవల్లులు పోటీల్లో మొదటి స్థానం సాధించిన పి.హారిక, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం కైవసం చేసుకున్న జి.లావణ్య ,యం. అఖిల లకు మంత్రి బహుమతులను అందించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2021 లో పట్టణ ప్రజలు క్రియా శీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో పట్టణాల స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, ఆర్డీవో అనంత రెడ్డి, సుడా వైస్ చైర్మన్ రమణా చారి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరామ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- తక్కువ వడ్డీరేట్లు.. ఇంటి రుణానికి ఇదే సరైన టైం!
- అనుమానం వద్దు.. తొలి టీకా నేనే వేయించుకుంటా : మంత్రి ఈటల
- వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు
- భారీ మొసలిని కాపాడిన వన్యప్రాణుల సంరక్షకులు
- మిలిటరీతో లింక్స్:జియోమీపై ట్రంప్ నిషేధం!
- ప్రణాళికా బద్దంగా పని చేయాలి : వినోద్ కుమార్
- కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష
- తెలంగాణ ఓటరు జాబితా ప్రకటన..
- మోడీ అనుచరుడికి మండలి సీటు
- స్టాక్స్ ’ఫ్రై’డే: నిమిషానికి రూ.575 కోట్లు లాస్