బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 12:09:02

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

వరంగల్ రూరల్: రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొలుగోలు చేస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, అధికారులు అందజేసే కూపన్ల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సంపత్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు‌.