ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 15:11:20

రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు

రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు

వరంగల్ రూరల్ : రైతులకు మద్దతు ధర దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. వర్ధన్నపేట మండలంలోని రాందన్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పించాలనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రంలో డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.