గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 01:58:38

కొనుగోళ్లు సాఫీగా సాగాలి

కొనుగోళ్లు సాఫీగా సాగాలి

  • వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు అండగా ఉంటుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శనివారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాల్లో ధా న్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జమ్మికుంట, ధర్మారం, హుజూరాబాద్‌లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. హుజూరాబాద్‌లో 34 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌  చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం హుజూరాబాద్‌లోని కేసీ క్యాంపులో అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆయా చోట్ల మంత్రి ఈటల మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.