బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 09, 2020 , 02:19:06

గ్రామగ్రామాన కొనుగోళ్లు

గ్రామగ్రామాన కొనుగోళ్లు

  • మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఓవైపు కరోనాపై పోరాడుతునే రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు.. గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రతి గింజను కొనేలా చర్యలు చేపట్టారు.. ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 14 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, ప్రస్తుతం 5 కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయని ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలుగ్రామాల్లో వరి, మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నీ బ్యాగుల కోసం సీఎం కేసీఆర్‌ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు ఇండ్లనుంచి బయటకు రాకుం డా లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. అనంతరం లైట్‌ మోటార్‌ వెహికిల్‌ మెకానిక్‌, మ్యాజిక్‌ ఆటో అసోసియేషన్లకు చెందిన 325 మంది సభ్యులకు బియ్యం, నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్‌ మండలం చిన్నగుండవెల్లి ఉప సర్పంచ్‌ కూతురు శ్రీవిజ్ఞ తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకును మంత్రికి అందజేసింది.


logo