శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 19:49:10

మళ్లీ ప్రారంభమైన ఎంజీకేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ మోటర్ల పంపింగ్‌

మళ్లీ ప్రారంభమైన ఎంజీకేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌ మోటర్ల పంపింగ్‌

నాగర్‌కర్నూల్‌ ‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల పరిధిలోని ఎల్లూరు శివారులోని రేగుమాన్‌గడ్డ వద్ద నిర్మించిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(ఎంజీకేఎల్‌ఐ) మొదటి లిఫ్ట్‌లోని మోటార్లు 30రోజుల విరామం అనంతరం ప్రాజెక్టు అధికారులు పంపింగ్‌ మళ్లీ ప్రారంభించారు. 

మొదటి లిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తూ వచ్చిన ఆపరేటర్లకు కరోనా వైరస్‌ సోకడంతో వారందరూ వారి సొంత ఊళ్లకు వెళ్లారు. దీంతో మోటర్లు పంపింగ్‌ నిలిపివేశారు. ఆపరేటర్లు తిరిగి విధుల్లోకి చేరడంతో మొదటి లిఫ్ట్‌లో ఉన్న ఐదు మోటర్లకుగానూ రెండు మోటార్లను రన్‌ చేశారు. logo