శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 20, 2020 , 01:53:09

పల్స్‌పోలియో సక్సెస్‌

పల్స్‌పోలియో సక్సెస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చేపట్టిన పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైంది. 35,93,121 మంది చిన్నారులకు వైద్యసిబ్బంది పోలియో చుక్కలను వేశారు. 38,36,505 మంది చిన్నారులకు చుక్కల మందువేయాలని వైద్యశాఖ లక్ష్యంగా పెట్టుకోగా 93.7 శాతం మందికి వేశారు. మిగిలిన చిన్నారులకు సోమ, మంగళవారాల్లో చుక్కల మందు వేయనున్నట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23,331 చుక్కల పంపిణీ కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని దవాఖానలు, బస్టాండ్లు, మెట్రోస్టేషన్లు, రైల్వే స్టేషన్లలోనూ చుక్కల మందు పంపిణీ చేపట్టారు. ఇందుకోసం 46,432 బృందాలు పనిచేశాయి.


logo