బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 00:03:38

17న పల్స్‌పోలియో

17న పల్స్‌పోలియో

హైదరాబాద్‌, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది. మొత్తం 38 లక్షలమంది చిన్నారులకు చుక్కలమందు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు 23వేల బూత్‌లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువు దగ్గర నుంచి ఐదేండ్ల లోపు చిన్నారులందరికీ చేరేలా సన్నాహాలు చేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో పల్స్‌ పోలియో నిర్వహణపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు పలు సూచనలు చేశారు. పోలియో సెంటర్ల వద్ద పూర్తి జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. నిర్ణయించిన తేదీల్లో పోలియో చుక్కల మందు వేయించుకోలేకపోయిన వారికోసం మరో రెండు రోజుల పాటు డోర్‌ టు డోర్‌ తిరిగి వ్యాక్సిన్‌ అందించాలిన సూచించారు. 


logo