బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 13:21:17

మొక్కలు నాటిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

మొక్కలు నాటిన ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

750x430 హైద‌రాబాద్ : ప‌్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపిచంద్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విసిరిన ఛాలెంజ్‌ను గోపిచంద్ స్వీక‌రించి గచ్చిబౌలి లోని తన బ్యాడ్మింటన్ అకాడమీ ప్రాంగణంలో నేడు మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌లో హ‌రిత‌హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ‌ల్ల ప‌చ్చ‌ద‌నం బాగా పెరుగుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల్లో కూడా మంచి అవ‌గాహ‌న ఏర్ప‌డింద‌న్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు అన్నారు. 

ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులైన సిక్కి రెడ్డి, మేఘన, అరుణ్ విష్ణు లను గ్రీన్ ఇండియా చాలెంజ్  ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇదే విధంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ముందుకు కొన‌సాగాలని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు. గోపిచంద్ తన ఇద్దరి కుమారులతో కలిసి మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడ ఓ మొక్కను నాటారు. logo