శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 15:16:57

ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ఎజెండా

ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ఎజెండా

హైదరాబాద్‌ : ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎజెండా అని ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్సీపురం 112 డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి బూరుగడ్డ పుష్పనగేశ్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఆర్సీపురం డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్‌కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీగా నామినేషన్‌ దాఖలు చేసేందుకు వారు వెళ్లారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. మన సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల వారు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.   

ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమానికే సీఎం కేసీఆర్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజలందరికి లబ్ధి చేకూర్చుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రజలకు అనినీతి రహిత పాలన అందుతుందని చెప్పారు. పటాన్‌చెరు, ఆర్సీపురం, భారతీనగర్‌ డివిజన్‌లల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.