గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 15:07:59

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఖమ్మం/బోనకల్లు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్  పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్  అన్నారు. ఆదివారం జిల్లాలోని బోనకల్లు మండలంలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని రావినూతలలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రైతు వేదికను పరిశీలించి మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకం వల్ల వేలాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన వివరించారు. 

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరా పింఛన్ల వల్ల అనేక మంది లబ్ధి పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టి పర్యావరణ పరిరక్షణకు పరిశుభ్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.logo