శనివారం 06 జూన్ 2020
Telangana - May 06, 2020 , 02:50:57

ఆర్టీసీ ఇప్పట్లో ప్రారంభంకాదు

ఆర్టీసీ ఇప్పట్లో ప్రారంభంకాదు

గ్రీన్‌ జోన్లలో ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రస్తుతానికి ఆర్టీసీ సేవలను ఎట్టిపరిస్థితుల్లో ప్రారంభించబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజారవాణాను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, గ్రీన్‌జోన్లలో మాత్రమే బస్సులు నడపాలని చెప్పిందని తెలిపారు. ‘సిద్దిపేట జిల్లా గ్రీన్‌ జోన్‌లో ఉంది. కానీ పక్క జిల్లాల లేదు. మరి యాడ్నుంచి యాడికి బస్సు దిప్పాలె? మన రాష్ట్రంలో 9 గ్రీన్‌ జిల్లాలున్నాయి. అవన్నీ ఇసిరేసినట్లుగ ఉన్నయి. ప్రస్తుతం ఆరెంజ్‌ జోన్లుగా ఉన్న 18 జిల్లాలు గూడా కొద్ది రోజుల్లో గ్రీన్‌ జోన్లయితున్నయి. మంత్రి రాజేందర్‌ రేపో, ఎల్లుండో కేంద్ర హెల్త్‌ సెక్రటరీతో మాట్లాడి వాటిని చేంజ్‌ చేపిస్తరు. వాటి స్టేటస్‌ మార్తది. ఆ తర్వాత 15న రివ్యూ మీటింగ్‌లో చర్చిస్తం. అప్పటివరకు బస్సులు నడపం. ఆ తర్వాత నడిపే అవకాశం ఉంటది. గ్రీన్‌ జోన్లలో ఆటో రిక్షాలకు, క్యాబ్‌లకు పూర్తిగా అవకాశం ఉంది. ఆరెంజ్‌ జోన్‌లో క్యాబ్‌లకు అవకాశం ఉంది. మిగతావాటికి లేదు’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.



logo