మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 22, 2020 , 06:51:48

నేడు ప్రజా రవాణా బంద్‌

నేడు ప్రజా రవాణా బంద్‌

హైదరాబాద్ : కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ఆది వారం ప్రజారవాణాను నిలిపివేయనున్నారు. అందులోభాగంగా నగరంలోని హైదరాబాద్‌ మెట్రోరైలుతో పాటు ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, క్యాబ్‌లు, ఆటోలు నిలిపివేయాలని ఆదేశించారు. జనతాకర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం ప్రతీ రవాణావిభాగం ఆదేశాలను అమల్లోకి తేనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దక్షిణమధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న 12 ఎంఎంటీఎస్‌ సర్వీసులు మిన హా మిగతా సర్వీసులను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఎంఎంటీఎస్‌లో 121 రైళ్లలో 12 మాత్రమే నడిపిస్తుండగా 30 వరకు సబర్బన్‌ రైళ్లు, జోన్‌పరిధిలో నడిచే 233 ప్యాసింజర్‌ రైళ్లతోపాటు ఇతర జోన్లకు సంబంధించిన 86 రైళ్లను రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.  అంతేకాకుండా ప్రయాణాలను రద్దు చేసుకుంటే టికెట్‌ మొత్తాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ కూడా మెట్రోరైళ్లను పూర్తిస్థాయిలో రద్దు చేసింది. 

ముఖ్యమంత్రి చెప్పనట్లుగా కేవలం 5 రైళ్లను మాత్రం ఎమర్జెన్సీ అవసరాల కోసం టెర్మినల్స్‌ వద్ద అందుబాటులో ఉంచుతా రు. నాగోల్‌, ఎల్బీనగర్‌, ఎంజీబీఎస్‌, రాయదుర్గ్‌, అమీర్‌పేట వద్ద అందుబాటులో ఉంచుతారు. ఈ విషయాన్ని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సిద్ధంగా ఉన్న రైళ్లను ఆపరేట్‌ చేస్తామని తెలిపారు. 5 రైళ్లు ప్రయాణికుల కోసం ఆపరేట్‌ చేయబోమని, కేవలం ముందుజాగ్రత్తలో భాగంగా సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 29 డిపోలకు చెందిన 2,800 బస్సులు రోడ్డెక్కవు. ఈ విషయాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలప్రకారం అత్యవసరం కోసం డిపోకు 5 బస్సుల చొప్పున 145 బస్సులు అందుబాటులో ఉంచుతామని అన్నారు. వీటికోసం తగిన డ్రైవర్లను అందుబాటులో ఉంచుతామని, కండక్టర్లు, ఇతర క్లీనింగ్‌ సిబ్బంది కూడా విధుల్లో పాల్గొనరన్నారు. స్టేషన్స్‌ పరిధిలోని దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలు మూసివేస్తారని ఈడీ తెలిపారు. అదేవిధంగా నగరంలో తిరిగే 40వేల క్యాబ్‌లు, లక్ష ఆటోలు కూడా రోడ్డెక్కవు. జనతకర్ఫ్యూ నేపథ్యంలో ఎవరూ బయటకురాని పరిస్థితి ఉన్న నేపథ్యం లో నగర ప్రయాణికును గమ్యస్థానాలకు చేర్చే  121 ఎంఎంటీఎస్‌ రైళ్లలో 12 మాత్రమే ఎమర్జెన్సీ సర్వీసుల కోసం నడిపిస్తున్నారు. 


logo