e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home తెలంగాణ ఈటల మాటలు.. ప్రజల తిట్ల తూటాలు

ఈటల మాటలు.. ప్రజల తిట్ల తూటాలు

ఈటల మాటలు.. ప్రజల తిట్ల తూటాలు
 • ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం
 • సామాజికమాధ్యమాల్లో మండిపాటు

హైదరాబాద్‌, జూన్‌ 4 (నమస్తే తెలంగాణ): నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు తయారైంది మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారం. ప్రభుత్వంపై.. టీఆర్‌ఎస్‌పై చిత్తం వచ్చినట్టు మాట్లాడి.. తనను తానే నిస్సిగ్గుగా బరిమాతల బయటపెట్టుకొన్నారు. శుక్రవారం నాటి ప్రెస్‌మీట్‌ అనంతరం ఆయనపై సామాజికమాధ్యమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున.. తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈటల మాటలకు రివర్స్‌గా ప్రజల నుంచి తూటాల్లాంటి తిట్లు, ప్రశ్నల దాడి ఎదురవుతున్నది. ఈటల మాటలు.. ప్రజల తూటాలేంటో చూద్దాం..

ఈటల మాట

 • తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు గానీ, ఆత్మగౌరవాన్ని మాత్రం పోగొట్టుకోరు. రైతుబంధు పేదోళ్లకివ్వండి.. ఉన్నోళ్లకు ఇవ్వొద్దన్నా? బెంజికార్లో వచ్చి రైతుబంధు తీసుకొంటున్రు
 • ప్రగతి భవన్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేరు.
 • మీరు ఒక్క మంత్రిపదవి ఇచ్చి బానిసలా బతుకుమంటే బతుకుతనా నేను. మంత్రి పదవి ఇచ్చి కోపం, రోషం అనే నరాన్ని కట్‌చేసి పడి ఏడవాలి అనే పద్ధతిలో మీరు చేసిండ్రు.
 • అందర్‌వాలే బాహర్‌.. బాహర్‌వాలే అందర్‌.. ఇంట్లోల్లు బయటకు వెళ్ళిపోతున్నరు
 • ఉన్న ఆస్తినన్నా అమ్ముకో కానీ ఆత్మగౌరవ పోరాటాన్ని మాత్రం వదిలిపెట్టకు అని నా భార్య చెప్పింది..
 • అడుక్కుంటే కాయో.. పండో మాత్రమే.. కానీ కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే అని చెప్పేవాడిని నేను.
 • ఆలె నరేంద్రను, విజయశాంతిని గట్లనే చేసి పంపిచ్చిండ్రు.
 • ఈ గ్యాప్‌ ఇప్పుడు రాలే.. ఐదేండ్ల క్రితమే వచ్చింది..
 • చట్టాన్ని నమ్మేటోడిని నేను
 • ఒక్క మంత్రి అన్నా స్వేచ్ఛగా పనిచేసే కథ ఉందా?
 • హుజూరాబాద్‌ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన బిడ్డను నేను. డబ్బును నమ్ముకోలేదు.

ప్రజల తూటా

 • ఇన్నాళ్లూ పక్కా లెఫ్టిస్టు అని చెప్పుకొన్న నువ్వు.. నాలుగురోజుల పాటు పడిగాపులు పడి మరీ రైటిస్టుల చంకనెక్కడం ఆత్మగౌరవమా?
 • నువ్వు మాత్రం ఎడ్ల బండిలో వచ్చి రైతుబంధు తీసుకొంటున్నవా? నువ్వేమన్న పేదోడివా? నువ్వెందుకు రైతుబంధు తీసుకొంటున్నవు?
 • అధికారుల్లో కూడా కులాలు చూస్తరా? రాజకీయాల్లో, రాజకీయ పదవుల్లో కులసమీకరణాలను, సామాజిక సమీకరణాలను చూస్తరు. ఇన్నేండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవ్‌.. గింత కూడా తెల్వదా?
 • అంత రోషమున్నోడివైతే.. ఏడేండ్ల సంది ఎందుకు ఆ పదవిని పట్టుకొని వేళ్లాడుతున్నవు? ఢిల్లీపోయి కాళ్లావేళ్లా పడ్డప్పుడు నీ కోపం, రోషం నరం తెగిపోలే..!
 • ఓసోస్‌.. లెఫ్టిస్టునని చెప్పుకొనే నువ్వు రైటిస్టు పార్టీలో చేరడాన్ని బాహర్‌వాలా అందర్‌ కాదా?
 • ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినయ్‌? అసైన్డు భూములను ఆక్రమించుకొని, కబ్జా చేసుకొని సంపాదించినవా? పౌల్ట్రీ రంగంలో వేలమంది ఉన్నరు. అందరూ నీలాగా వందలు వేల కోట్లు సంపాదించలేదేం?
 • కరెక్టే.. అదే సమయంలో ఆక్రమించుకుంటే పోయేదేమీ లేదు. అసైన్డు భూములు తప్ప అనికూడా చెప్పాల్సి ఉండే.
 • అప్పుడే నువ్వెందుకు మాట్లాడలే? ఎందుకు రిజైన్‌ చేయలే? పదవి, అధికారం కోసమే ఇన్నేండ్లు ఉన్నవా?
 • గ్యాప్‌ వచ్చిన తర్వాత కూడా మంత్రిపదవి ఎందుకు తీసుకొన్నవ్‌? నీ వ్యాపారాన్ని, ఆస్తులను పెంచుకోవడానికేనా?
 • అసైన్డు భూములను కొనటం, అమ్మటం చట్టవ్యతిరేకమని తెల్వదా? అటవీ అనుమతి లేకుండా చెట్లు కొట్టొద్దని తెల్వదా? అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేయవద్దని తెలియదా?
 • మరి నువ్వు చేరుతున్న పార్టీతో నేతలందరితో చర్చించి పూర్తి స్వేచ్ఛాయుతంగా పరిపాలిస్తున్నారా? ప్రపంచం ఏమనుకొంటున్నదో తెల్వదా?
 • మరి వందల ఎకరాల భూములు, వేలకోట్ల ఆస్తులు ఎట్లొచ్చినయో? వామపక్ష వాదినంటవు కదా? అవన్నీ ప్రజలకు పంచుతవా?
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈటల మాటలు.. ప్రజల తిట్ల తూటాలు

ట్రెండింగ్‌

Advertisement