Telangana
- Dec 24, 2020 , 15:37:08
గురుకుల పాఠశాలల్లో సైకాలజిస్టులను నియమించాలి

హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సైకాలజిస్టులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సైకాలజిస్టుల సంఘం ప్రభుత్వానికి సూచించింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాంచందర్ ఆధ్వర్యంలో సైకాలజిస్టులు ఎ.సుధాకర్, బి.అరుణ్ కుమార్, వై.శివరామప్రసాద్, దేదిప్య గురువారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ను కలిశారు.
ఈ సందర్భంగా వారు మంత్రికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు చదువు పట్ల మరింత శ్రద్ధ చూపేందుకు, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు, జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు గాను సైకాలజిస్టుల తోడ్పాటు అవసరమన్నారు. తమ విజ్ఞప్తిని వెంటనే పరిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మంత్రిని కోరారు.సైకాలజిస్టుల సంఘం విజ్ఞప్తిని తప్పక పరిశీలిస్తానని మంత్రి వారికి హామీనిచ్చారు.
తాజావార్తలు
- భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?
- ఈ ‘పాటలు’ మీకు గుర్తున్నాయా ?
- ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
- ధరణి’లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- ఏపీలో కొత్తగా 137 కొవిడ్ కేసులు
- హెచ్-1బీపై ట్రంప్.. జో బైడెన్ వైఖరి ఒకటేనా?!
- నరేంద్ర చంచల్ మృతి.. ప్రధాని సంతాపం
- గంటవ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య..
MOST READ
TRENDING