శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 13:32:50

మానసిక ఆరోగ్యం కాపాడడంలో సైకాలజిస్ట్‌లది కీలకపాత్ర : కవిత

మానసిక ఆరోగ్యం కాపాడడంలో సైకాలజిస్ట్‌లది కీలకపాత్ర : కవిత

హైదరాబాద్‌ : వ్యక్తి శారీరక ఆరోగ్యం ఎంతో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం పలువురు సైకాలజిస్ట్‌ నిపుణులు మంగళవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషన్స్‌‌ బిల్లు ద్వారా సైకాలజిస్ట్‌లకు మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఇటీవల తెలంగాణ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌ క్వాలిటీ వెరిటాస్‌ సర్టిఫికేషన్‌ లిమిటెడ్‌ లండన్‌ నుంచి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ పొందడం హర్షించదగ్గ పరిణామమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సంఘం మానసిక ఆరోగ్యంపై కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన శిక్షణ అందించి సర్టిఫికెట్‌ పొందడంపై యూనియన్‌ నాయకత్వాన్ని అభినందించారు. ఇటీవల పార్లమెంట్‌ నేషనల్‌ కమిషనర్‌ ఫర్‌ అలైడ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషర్‌ బిల్లు-2020 ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ బిల్లు చట్టంగా రూపుదిద్కుకుంటే హెల్త్‌కేర్‌ ప్రొవైడర్లకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవి ప్రసాద్‌ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా సంఘం చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో ఎంతో ఉపయుక్తమైనవన్నారు. మానసిక రుగ్మతలు రూపుమాపడంలో సైకాలజిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. సంఘం అధ్యక్షుడు మోతుకూరి రాంచందర్‌, నాయకులు లక్ష్మి, సుధాకర్‌, అరుణ్‌కుమార్‌ బోడ, జి హరిత, సాహితి, దివ్య లోచన, దేదీప్య తదితరులు పాల్గొన్నారు.


logo