శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 01:27:27

ఇన్సూరెన్స్‌ మంజూరు పత్రాలు అందజేత

ఇన్సూరెన్స్‌ మంజూరు పత్రాలు అందజేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పార్టీ సభ్యత్వం ఉండి ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి అందించే రూ.2 లక్షల మొత్తానికి సంబంధించిన ఇన్సూరెన్స్‌ మంజూరు పత్రాలను తెలంగాణభవన్‌లో గురువారం ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి అందజేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన తంగల్లపల్లి కళావతి, జడ్చర్లకు చెందిన కొండం జ్యోతి, చేవెళ్లకు చెందిన బీ శశికళ, కుత్బుల్లాపూర్‌ అవదూత విజయలక్ష్మికి మంజూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్సూరెన్స్‌ విభాగం ఇంచార్జి కావేటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


logo