శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 22, 2021 , 11:41:41

పోలీస్‌ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు

పోలీస్‌ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : పోలీస్‌ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న 230 మంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందిస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసానిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో మల్టీపర్పస్‌ మైదానంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులకు ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నిత్యం ఉదయం అల్పాహారం అందిస్తానని, ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరైనట్లు పేర్కొన్నారు. గతంలో పత్తి మార్కెట్ యార్డులో, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్‌లో నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో స్టడీ మెటీరియల్ ఇచ్చామని, అదే తరహాలో అందిస్తానని హామీ ఇచ్చారు. రాత పరీక్షల కోసం శిక్షణ అందిస్తామని, మూడునెలల తర్వాత ఫిజికల్‌ ట్రైనింగ్‌ సైతం ఇప్పించనున్నట్లు తెలిపారు. మైదానంలో రన్నింగ్‌ ట్రాక్‌, హైజంప్‌, లాంగ్‌ జంప్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగార్థుల కలిసి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అల్పాహారం చేశారు. అనంతరం కళాశాల ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబంది పాల్గొన్నారు. 

పెద్దమ్మ ఆలయానికి భూమిపూజ 

పట్టణంలోని 10వ మున్సిపల్ వార్డు పరిధిలో ముదిరాజ్ కులస్థుల సమక్షంలో పెద్దమ్మ దేవాలయ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చేందుకు వీలుగా రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం నేతలుధర్మ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo