గురువారం 02 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 17:30:13

యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించండి : మంత్రి కొప్పుల

యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించండి : మంత్రి కొప్పుల

హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బీసీ, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, ఇతర ఉపాధి అవకాశాలు కల్పించాలని సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ సంక్షేమ భవనంలోని సమావేశ మందిరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చే పలు సంస్థల ప్రతినిధులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూలాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు బీహార్ ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ వారి సొంత రాష్ట్రాలకు తరలిపోవడంతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయన్నారు.ఎస్సీ, ఎస్టీలను విద్యావంతులు చేయడానికి ప్రభుత్వం గురుకుల వ్యవస్థను పెద్ద త్తున ప్రారంభించిందని తెలిపారు. అలాగే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యార్హతలను బట్టి యువతకు వారికి ఏ రంగంలో శిక్షణ ఇస్తే బాగుంటుందో ప్రణాళికలను సిద్ధం చేసుకోండని సూచించారు. ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తే ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.


logo