గురువారం 02 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 12:26:11

రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి నిరంజన్‌రెడ్డి

రంగారెడ్డి : రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలోని కేజీఆర్‌ గార్డెన్స్‌లో జరిగిన నియోజకవర్గ రైతు అవగాహన సదస్సుకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుక్రితం చేవెళ్లలో రైతుబజార్‌ ప్రారంభోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియంత్రిత పంటల సాగుపై జరిగిన అవగాహన సదస్సులో మంత్రి మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ... 

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. మన దేశంలో పుష్కలంగా వనరులు ఉన్నాయన్నారు. ప్రపంచాన్ని సాకగలిగే శక్తి మన దేశానికి ఉందన్నారు. ధాన్యం ఉత్పత్తి సేకరణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. తెలంగాణ వచ్చినంక కరెంట్‌, తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కారం అయినట్లు వెల్లడించారు. ప్రజలకు అవసరమైన పంటలనే పండించాలన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలను పండిస్తేనే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదన్న మంత్రి రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.


logo