శనివారం 06 జూన్ 2020
Telangana - May 12, 2020 , 16:19:26

విద్యుత్‌ సౌకర్యం కల్పించండి : ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్

విద్యుత్‌ సౌకర్యం కల్పించండి : ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్

మంచిర్యాల:  రాష్ట్రంలో పెద్ద ఎత్తున పామాయిల్ సాగు చేయటానికి  ముఖ్యమంత్రి కేసిఆర్  నిర్ణయం తీసుకున్న దరిమిలా చెన్నూరు నియోజక వర్గం లో పామాయిల్ సాగు  చేయినున్నట్లు చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో  విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కలిశారు.  చెన్నూరు నియోజక వర్గంలోని 5 మండలాల్లో రైతులు కోరిన చోట  విధ్యుత్ సౌకర్యం (విద్యుత్ స్థంబాలు, కరెంట్ లైన్)లు కల్పించాలని మంత్రిని కోరారు. విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తే పెద్ద ఎత్తున  పామాయిల్‌ సాగు చేపడుతామన్నారు. తక్షణమే మంత్రి స్పందించి ఫోన్ ద్వారా TSNPDCL చైర్మన్ గోపాల్ రావుతో మాట్లాడి చెన్నూరు నియోజక వర్గం లోని రైతులకి విద్యుత్‌  సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.


logo