గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 02, 2020 , 21:10:51

గ‌ని ప్ర‌మాద‌ క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాలి : క‌విత‌

గ‌ని ప్ర‌మాద‌ క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాలి : క‌విత‌

హైద‌రాబాద్ : శ్రీ‌రాంపూర్ ఏరియా ఆర్‌కే-5 గ‌నిలో బుద‌వారం జరిగిన ప్ర‌మాదం అత్యంత బాధాక‌ర‌మ‌ని మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. గ‌ని ప్ర‌మాదంపై ఆమె స్పందిస్తూ... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్న‌ట్లు తెలిపారు. గాయ‌ప‌డ్డ‌ కార్మిక సోదరులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. సాయంత్రం ఆరు గంట‌ల ప్రాంతంలో గ‌నిలో బ్లాస్టింగ్ కోసం రంద్రాలు వేస్తుండ‌గా మిస్ ఫైర్ అయింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. కోల్ క‌ట్ట‌ర్ ర‌త్నం లింగ‌య్య తీవ్రంగా గాయ‌ప‌డ‌గా గాదె శివ‌య్య‌, ప‌ల్లె రాజ‌య్య‌, చిలుక సుమ‌న్ ల‌కు స్వ‌ల్ప గాయాలయ్యాయి. 

తాజావార్తలు


logo