బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 01:11:58

'తల్లిగా బాధగా ఉన్నా.. నా బిడ్డని చూస్తే గర్వంగా ఉంది'

'తల్లిగా బాధగా ఉన్నా.. నా బిడ్డని చూస్తే గర్వంగా ఉంది'

భారత్ - చైనా బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంపై ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో సంతోష్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 'నా కుమారుడు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు గర్వంగా ఉంది కానీ తల్లిగా మాత్రం బాధగా ఉంది' అంటూ కన్నీటిపర్యంతమయ్యరు సంతోష్ తల్లి. తమ కుమారుడు చనిపోవడం బాధగా ఉన్నా దేశం కోసం ప్రాణాలర్పించడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు అన్నారు. నెల రోజుల్లోనే హైదరాబాద్ వస్తానని చెప్పినట్లు వారు తెలిపారు. చిన్న వయసులోనే కల్నల్ స్థాయికి ఎదిగాడని, డిపార్ట్‌మెంట్ విషయాలు కుటుంబంతో ఎప్పుడూ చెప్పేవాడు కాదని అన్నారు. విధి నిర్వహణలో తనకేం జరిగినా ధైర్యంగా ఉండాలని తమతో చెప్పేవాడన్నారు. logo