ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:56:17

ఎంపీ అర్వింద్‌ ఇంటి ఎదుట ధర్నా

ఎంపీ అర్వింద్‌ ఇంటి ఎదుట ధర్నా

  • రైతు చట్టాలకు వ్యతిరేకంగా యూత్‌ కాంగ్రెస్‌ నిరసన

నిజామాబాద్‌ సిటీ, జనవరి 12: రైతుల మద్దతుతో గెలిచిన ఎంపీ అర్వింద్‌ ప్రస్తుతం వారికి వ్యతిరేకంగా మారడం సిగ్గుచేటని యువజన కాం గ్రెస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు జేవీ యాదవ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా మంగళవారం యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఎంపీ అర్వింద్‌ ఇంటిముందు ధర్నా నిర్వహించారు. జేవీ యాదవ్‌ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఎంతోమంది రైతులు చనిపోతున్నా కేంద్రం మౌనంగా ఉండటం సరికాదన్నారు.