గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 20:56:30

'విచ్చిన్నకర శక్తుల నుంచి నగరాన్ని కాపాడుకుందాం: సీఎం కేసీఆర్‌

'విచ్చిన్నకర శక్తుల నుంచి నగరాన్ని కాపాడుకుందాం: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : విచ్చిన్నకర శక్తుల నుండి హైదరాబాద్‌ నగరాన్ని కాపాడుకుందామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాగ్యనగరవాసులకు పిలుపునిచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ శనివారం ప్రగతి శంఖారావం సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ కుటుంబ పెద్దగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా నగర ప్రజానీకానికి తనదొకటే విజ్ఞప్తి అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పిచ్చి ఆవేశానికి పోయి ఆగంచేసుకుంటే హైదరాబాద్‌ ఆగం అయితదన్నారు. 

మొత్తం భూముల విలువలు పోతాయి. ఆస్తుల విలువలు పోతాయి. వ్యాపారాలు బంద్‌ అయితయ్‌. పిల్లలకు ఉపాధి అవకాశాలు పోతాయి. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి రానీయొద్దని కోరారు. హైదరాబాద్‌కు ఇది ఏమాత్రం క్షేమకరం కాదన్నారు. మన పిల్లల భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు, ఒక ఉజ్వలమైనటువంటి నగరాన్ని ఉజ్వలంగా పోషించుకుని ముందుకు పోవాలన్నారు. గొప్పగా పోతున్న ఈ రాష్ర్టానికి ఇంకా గొప్పదనాన్ని ఆపాదించుకోవాలన్నారు. అందరం చిరునవ్వులతోని, సంతోషంతోని, కలకలలాడే హైదరాదాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందామని పేర్కొన్నారు. 

తాజావార్తలు


logo