సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:18

హుందాగా..సౌకర్యంగా..

హుందాగా..సౌకర్యంగా..

  • కొత్త సచివాలయం నిర్మాణంపై అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • డిజైన్‌లో మార్పులపై సూచనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సచివాలయ కొత్త భవనం హుందాగా, సౌకర్యవంతంగా నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుం దాగా ఉండాలని, లోపల అన్ని సౌకర్యాలు కలిగి, పని చేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దాలని చెప్పారు. కొత్త సచివాలయ భవన నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సచివాలయ డిజైన్లను పరిశీలించి, కొన్ని మార్పులు సూచించారు. భవనంలో ఉండాల్సిన వాటిపై సూచనలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారులు, వారి సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యాలయాలు ఉండాలని చెప్పారు. వీఐపీలు, డెలిగేట్లు, డిగ్నిటరీలు, ఇతర ప్రముఖులు, అతిథుల కోసం ప్రత్యేక వెయిటింగ్‌ హాళ్లు ఉండాలని చెప్పారు. సచివాలయంలో ఏం పని జరుగుతుంది? ఎందరు పనిచేస్తారు? ఎందరు సందర్శకులుంటారు? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ముఖ్య కార్యదర్శులు సునీల్‌శర్మ, రామకృష్ణారావు, రజత్‌కుమార్‌, నర్సింగ్‌రావు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆర్క్‌టెక్ట్‌ నిపుణులు ఆస్కార్‌, పొన్ని పాల్గొన్నారు.logo