గురువారం 02 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 16:37:37

రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : వీధుల్లో రోడ్లు, డ్రైనేజీలు లేని చోట నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఎక్సైజ్‌ శాఖ  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌లోని సంతోష్‌నగర్‌ కాలనీలో వీధి వీధి తిరిగి రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఏది తక్కువైనా తమకు తెలియజేయాలని సూచించారు. అదే విధంగా పట్టణంలోని మోటర్‌ లేన్‌ వద్ద రూ.20 లక్షలతో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత లీడ్‌ బ్యాంకర్ల డీసీసీ/డీఎల్‌ఆర్‌సీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. 


logo