మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 11:49:09

జీహెచ్ఎంసీలో ఆగిన ఆస్తుల న‌మోదు

జీహెచ్ఎంసీలో ఆగిన ఆస్తుల న‌మోదు

హైదరాబాద్: వ‌ర్షాల కార‌ణంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఆస్తుల న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారులు వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటుండ‌టంతో ఆస్తుల న‌మోదును నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. న‌గ‌రంలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న త‌ర్వాత స‌ర్వేను కొన‌సాగిస్తామ‌ని వెల్ల‌డించారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వచ్చేంత‌వ‌ర‌కు ఆస్తుల న‌మోదు చేప‌ట్టొద్ద‌ని ఆదేశాలు జారీచేసింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo