సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:31

ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహం

ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహం

  • అధికారులకు నిరంజన్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా పామాయిల్‌కు భారీగా డిమాండ్‌ ఉన్నదని, రైతులను ఆయిల్‌పాం సాగుదిశగా ప్రోత్సహించాలని, సాగులో వారికి ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించాలని అధికారులను వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఆధ్వర్యంలో అడ్వైజరీ కమిటీ సోమవారం సమావేశమైంది. ఇప్పటికే కేంద్రం రాష్ట్రంలో 7.64 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు అనుమతులు ఇచ్చిందని, దీంతో దశలవారీగా ఏటా లక్ష ఎకరాల చొప్పున సాగును పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులైన దేవరకద్ర, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యేలు, వ్యవసాయశాఖ కార్యదర్శి, కేంద్రప్రభుత్వ అధికారులు, నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo