ఆదివారం 31 మే 2020
Telangana - May 08, 2020 , 02:06:50

137 మందికి పదోన్నతి

137 మందికి పదోన్నతి

  • నీటిపారుదలశాఖలో ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నీటిపారుదలశాఖలో తొలిసారిగా బ్యాచ్‌వారీగా పదోన్నతులు కల్పించారు. 137 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల(ఏఈఈ)కు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు(డీఈఈ)గా పదోన్నతులు కల్పిస్తూ నీటిపారుదలశాఖ ఈఎన్సీ (పరిపాలన) నాగేంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 2007 బ్యాచ్‌కు చెందిన 80 మంది ఏఈఈలతోపాటు 2008 బ్యాచ్‌కు చెందిన 57 మంది ఈ జాబితాలో ఉన్నారు. పదోన్నతుల జాబితాలో జోన్‌-5కు చెందిన 39 మంది, జోన్‌-6కు చెందిన 98 మంది ఏఈఈలు ఉన్నారు. ఇవి తాత్కాలిక పదోన్నతులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్యాచ్‌వారీగా పదోన్నతులపై హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు ఏఎస్‌ఎన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్‌, గౌరవాధ్యక్షులు మహేందర్‌, వెంకటేశం తదితరులు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు.


logo