శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:32:35

ఇరిగేషన్‌లో 15 మందికి పదోన్నతి

ఇరిగేషన్‌లో 15 మందికి పదోన్నతి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో 15 మంది ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు ప్రభుత్వం సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు(ఎస్‌ఈలు)గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ఆశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సీతారామ లిఫ్ట్‌ స్కీంలో ఈఈ ఆనంద్‌కుమార్‌కు అదే ప్రాజెక్టులో ఎస్‌ఈగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఎల్‌ఎండీలోని జీ శ్రీనివాస్‌ను జగిత్యాల సీఈ ఆఫీస్‌కు, కాళేశ్వరం గజ్వేల్‌ సర్కిల్‌లోని బద్రినారాయణను నిజామాబాద్‌కు, పాలమూరు  రంగారెడ్డి రెండో డివిజన్‌లోని విజయ భాస్కర్‌రెడ్డిని అదే ప్రాజెక్టు సర్కిల్‌ 1కు, డిండి లిఫ్ట్‌ స్కీంలోని విశ్వనాథంను హైడ్రాలజీ హైదరాబాద్‌కు బదిలీ చేసి పదోన్నతి కల్పించారు. మెదక్‌ మైనర్‌ ఇరిగేషన్‌ ఈఈ యేసయ్యను తూప్రాన్‌ సర్కిల్‌కు, పాలమూరు  రంగారెడ్డి సర్కిల్‌ 2లోని సత్యశీలారెడ్డిని పెబ్బేరు సర్కిల్‌కు, జూరాల ప్రాజెక్టు సర్కిల్‌ 1లోని చంద్ర శ్రీనివాసరావును గద్వాల్‌ సర్కిల్‌కు, పాలమూరు సర్కిల్‌ 2లోని కే శ్రీనివాస్‌ను మహబూబ్‌నగర్‌ సర్కిల్‌కు బదిలీచేసి పదోన్నతి ఇచ్చారు. సీడీవో ఆఫీస్‌లోని సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌కు పదోన్నతి కల్పించారు. ఎల్లంపల్లిలోని సత్యరాజచంద్రను పెద్దపల్లి సర్కిల్‌కు, దేవాదుల డీసీఈ వెంకటేశ్వర్లును నర్సంపేట సర్కిల్‌కు, ఖమ్మం ఐబీ ఈఈ నర్సింహారావును కోదాడ సర్కిల్‌కు, సీడీవో ఈఈ అబ్దుల్‌ ఫాజల్‌ను కామారెడ్డికి బదిలీచేసి ఎస్‌ఈగా పదోన్నతి కల్పించారు. 

నలుగురు ఎస్‌ఈల బదిలీ

నలుగురు ఎస్‌ఈలను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాలమూరు సర్కిల్‌ 2 ఎస్‌ఈ ఏఎస్‌ఎన్‌ రెడ్డిని భువనగిరికు, డిండి లిఫ్ట్‌లో పనిచేస్తున్న బస్వరాజ్‌ను సిద్దిపేటకు, కాళేశ్వరం ప్రాజెక్టు సిద్దిపేట ఎస్‌ఈ కేఎన్‌ ఆనంద్‌ను నల్లగొండకు, సీడీవో ఎస్‌ఈ ప్రమీలను వాలంతరీ ఎస్‌ఈగా బదిలీ చేశారు.


logo