శనివారం 30 మే 2020
Telangana - May 10, 2020 , 01:29:23

సన్నాలకు ప్రోత్సాహం

సన్నాలకు ప్రోత్సాహం

  •  మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా వానకాలం వ్యవసాయ సీజన్‌లో సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం హాకాభవన్‌లో వానకాలం సాగు సన్నాహక చర్యలపై  అధికారులతో సమీక్షించారు. జిల్లాలవారీగా సన్నరకం వరి వంగడాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం ఏ మేరకు సన్న వంగడాలు అందుబాటులో ఉన్నాయో తెలుపాలని ఆదేశించారు. దొడ్డు రకం వరి సాగు నుంచి సన్నాలసాగు దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. అదేసమయంలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగుచేసేవిధంగా రైతుల్లో చైతన్యం తీసుకొనిరావాలని సూచించారు. గత వానకాలంలో 40 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, 23 లక్షల ఎకరాలలో సన్నాలు సాగయ్యాయని తెలిపారు. ఈ సారి 30 నుంచి 35 లక్షల ఎకరాల్లో సన్నరకాలు సాగయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సన్నరకం సాగుచేసేందుకు ముందుకొచ్చే రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సాంకేతిక సలహాలు అందించాలని సూచించారు. సమీక్షలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, అగ్రి వర్సిటీ వీసీ ప్రవీణ్‌ రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, ఎండీ కేశవులు తదితర అధికారులు పాల్గొన్నారు.logo