బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:35

బాలల హక్కుల నేత అచ్యుతరావు ఇకలేరు

బాలల హక్కుల నేత అచ్యుతరావు ఇకలేరు

  • అనారోగ్యంతో కన్నుమూత

మన్సూరాబాద్‌/ హిమాయత్‌నగర్‌/ మలక్‌పేట: బాలల హక్కుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పీ అచ్యుతరావు (58) మలక్‌పేట్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందారు. ఆయన ప్రముఖ కార్టూనిస్ట్‌ శ్రీధర్‌కు స్వయానా సోదరుడు. అచ్యుతరావు అనారోగ్య సమస్యతో ఈ నెల 15న దవాఖానలో చేరారు. అస్తమా, డయాబెటిస్‌ రెండూ ఉండటంతో కరోనా వైరస్‌ నుంచి కోలుకోలేక మృతిచెందారని వైద్యులు తెలిపారు. ఆయన మృతిపై సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, తెలంగాణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, కే రామకృష్ణ సంతాపం తెలిపారు.


logo