గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 20:30:37

200 దుకాణాల్లో త‌నిఖీలు.. నిషేధిత మాంజా స్వాధీనం

200 దుకాణాల్లో త‌నిఖీలు.. నిషేధిత మాంజా స్వాధీనం

హైద‌రాబాద్ : హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని దుకాణాల్లో అట‌వీశాఖ‌ అధికారులు గురువారం త‌నిఖీలు చేప‌ట్టారు. 13 ప్రత్యేక బృందాలుగా ఏర్ప‌డిన అధికారులు దాదాపు 200 దుకాణాల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత 20 కేజీల‌ (100 కి.మీ.) మాంజను స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిపిన త‌నిఖీల్లో అట‌వీశాఖ అధికారులు మొత్తం 111.5 కేజీల‌(557.5 కి.మీ) మాంజ‌ను స్వాధీనం చేసుకున్నారు. 
logo