శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 09:35:56

తెలంగాణ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే వ్యక్తి

తెలంగాణ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే వ్యక్తి

హైదరాబాద్‌ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌... ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌.. జయశంకర్‌ సార్‌కు ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ ద్వారా ఎంపీ స్పందిస్తూ.... వెలకట్టలేని సేవలు, అత్యున్నత వ్యక్తిత్వం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ సొంతమన్నారు. తెలంగాణ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే వ్యక్తి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో లెక్కలేనన్ని క్షణాలను సార్‌తో పంచుకున్నందుకు తాను ధన్యుడని తెలిపారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘన నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా కొనియాడారు. సార్‌ కలలు కన్నట్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందతూ బంగారు తెలంగాణ దిశగా ముందడుగు వేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పుట్టుక నీది. మరణం నీది. బతుకంతా తెలంగాణది. జోహార్‌ జయశంకర్‌ సార్‌ అని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కొనియాడారు. 


logo