శనివారం 30 మే 2020
Telangana - May 22, 2020 , 22:21:28

క్రాప్‌ కాలనీలు ఉన్నచోటే ప్రాసెసింగ్‌ యూనిట్లు : సీఎం కేసీఆర్‌

క్రాప్‌ కాలనీలు ఉన్నచోటే ప్రాసెసింగ్‌ యూనిట్లు : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయం, మార్కెటింగ్‌ నిపుణలతో సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంటల సాగు, అగ్రి బిజినెస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి అంశాలపై సీఎం సమీక్ష చేపట్టారు. అదేవిధంగా ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపైనా సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... వ్యవసాయంలో మార్పులకు స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలకు ముడిసరుకు నిరంతరం అందేలా పంటలు ఉండాలన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ వ్యవసాయం రూపురేఖలు మారాలన్నారు. రైతుల పంటలకు విలువ జోడించేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు ఏర్పాటు కావాలన్నారు. నాణ్యమైన ఉత్పత్తులతో తెలంగాణకు బ్రాండ్‌ ఇమేజ్‌, అంతర్జాతీయ డిమాండ్‌ తీసుకురావాలన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకంలో కూడా మార్పు రావాలని చెప్పారు. వ్యాపారుల మాట నమ్మి రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందులు అధికంగా వాడుతున్నారని అన్నారు. క్రాప్‌ కాలనీలు ఉన్నచోటే ఇండస్ట్రీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రావాలని సీఎం పేర్కొన్నారు.


logo