గురువారం 21 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 17:12:05

టీఆర్‌ఎస్‌తోనే సమస్యలు పరిష్కారం : మంత్రి కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌తోనే సమస్యలు పరిష్కారం : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ :  ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతిపక్షాలు విన్యాసాలు చేస్తున్నాయి. మాటల కంటే ఎక్కువగా చేతల ద్వారా టీఆర్‌ఎస్‌ అభివృద్ధి చేసి చేపింది. సమస్యల పరిష్కారం కూడా టీఆర్‌ఎస్‌ మాత్రమే చేయగలదని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణభవన్‌లో బీసీ సంఘాలతో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బలహీనవర్గాల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 150 సీట్లకుగాను బీసీలకు 75 స్థానాలను కేటాయించినట్లు తెలిపారు. సంఘాలు, కులాలు, వర్గాలపరంగా కొన్ని సమస్యలున్నాయన్నారు. పేదలు ఏ కులం వారైనా న్యాయం చేయాలనేది సీఎం ఉద్దేశం అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కులాలు, మతాలు, వర్గాలకతీతంగా అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం కుల వృత్తులవారికి ఆర్థికసాయం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. రజక సమాజం నుంచి బస్వరాజు సారయ్యకు సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్నారు. ఎంబీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలు సంఘాలు గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించాయన్నారు. బీజేపీ నేతలు యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల కోసమే బండి సంజయ్‌ దిగజారి మాట్లాడుతున్నారు. ఆరేండ్లుగా తెలంగాణ సమాజం ఒకటిగా కలిసి ఉంది. సంఘాలుగా సమస్యలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌ ప్రజలుగా ఒక్కటి కావాల్సిన సందర్భం వచ్చిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. 


logo