శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 01:57:16

ప్రైవేటు టీచర్లకు ప్రతి నెలా జీతాలివ్వాలి

ప్రైవేటు టీచర్లకు ప్రతి నెలా జీతాలివ్వాలి

  • అవసరమైతే విద్యాచట్టం సవరణకు సిఫార్సు
  • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లతోపాటు నాన్‌టీచింగ్‌ సిబ్బందికి ప్రతి నెలా జీతాలు చెల్లించాల్సిన నైతిక బాధ్య త యాజమాన్యాలపై  ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రైవేటు సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల్ల సంఘం ప్రతినిధులు వినోద్‌కుమార్‌ను కలిసి సమస్యలను వివరించారు.  ప్రైవేటు టీచర్ల జీతాల కోసం అవసరమైతే తెలంగాణ విద్యాచట్టం-82లో సవరణకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వినోద్‌కుమార్‌ చెప్పారు.  అపార్ట్‌మెంట్లకు సంబంధించి తెచ్చి న ‘రెరా’ చట్టం మాదిరిగానే.. ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు వసూ లు చేసే ట్యూషన్‌ ఫీజును..  సంస్థలోని టీచర్లు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది జీతాల కోసం తొలుత వెచ్చించేలా చట్టం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.  


logo