బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 20:37:34

ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా..

ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా..

హైదరాబాద్ : ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం బాలాజీ లేఔట్ వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 15 మంది విద్యార్థులు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 


logo