ప్రజా రవాణాకు ప్రాధాన్యత : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా.. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా.. రవాణాకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులకు రూ.4 కోట్ల 50 లక్షలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముస్తాబాద్ చౌరస్తా నుంచి గాడిచర్లపల్లి, పుల్లూరు గ్రామాల మధ్య వరకు నాలుగు వరుసల రహదారి మంజూరు చేసుకోగా పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలు, భారీ వాహనాలు వెళ్లడంతో బీటీ రోడ్డు దెబ్బతిన్నదన్నారు. అది దృష్టిలో పెట్టుకొని ముస్తాబాద్ రోడ్డులో పుల్లూరు, రాఘవాపూర్, లక్ష్మిదేవిపల్లి గ్రామాలను అనుసంధానం చేసి రోడ్డు మరమ్మతులకు 9 కిలో మీటర్లకు రూ. 2 కోట్ల 50 లక్షలు, రాఘవాపూర్‌లో రోడ్డుకు ఇరువైపులా మురికి కాల్వలు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.
సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి రంగీలా దాబా చౌరస్తా వరకు మరమ్మతులకు 3 కిలో మీటర్లకు గాను రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం రెండు రహదారుల మరమ్మతులకు రూ.4 కోట్ల 50 లక్షలు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి అందుబాటులోకి తెస్తామన్నారు.
తాజావార్తలు
- కమలా హర్రీస్ రాజీనామా.. దేనికంటే!
- టెస్లా మస్క్ స్టైలే విభిన్నం: పన్ను రాయితీకే మొగ్గు
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్