బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:30

బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం

బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం

  • ఆర్థిక బలోపేతానికి కార్యక్రమాలు
  • సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీసీల సంక్షేమానికి ప్రా ధాన్యం ఇవ్వాలని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. బీసీ సంక్షేమశాఖ పథకాలపై అధికారులతో మంత్రి తన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలుచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్‌, వివిధ ఫెడరేషన్లకు కేటాయించిన నిధు లు, లబ్ధిదారుల సంఖ్య, వివిధ పథకాల అమలుపై చర్చించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి వీ సైదా, బీసీ కార్పొరేషన్‌ ఎండీ అలోక్‌కుమార్‌, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, రజక, నాయీ బ్రాహ్మ ణ, వడ్డెర ఫెడరేషన్ల ఎండీలు పాల్గొన్నారు.


logo