శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 20:07:49

తెలంగాణ‌పై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు

తెలంగాణ‌పై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై కేంద్రం ప్ర‌శంస‌లు కురిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వివిధ రైల్వే ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజనలో సాధించిన పురోగతిని పీఎం సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌-161 లోని సంగారెడ్డి–అకోలా– నాందేడ్ సెక్షన్‌కు చెందిన నాలుగు లేనింగ్ విషయంలో సాధించిన పురోగతిని పీఎం మోదీ అభినందించారు. భూసేకరణ, పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పురోగతి సాధించిందని కేంద్ర రవాణా కార్యదర్శి ఎ.గిరిధర్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా, రహదారులు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ , ఔషధ నియంత్రణ పరిపాలనశాఖ సంచాలకులు డా.ప్రీతి మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు.


VIDEOS

logo