సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 22:46:11

ధరలు పెంచితే ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి...

ధరలు పెంచితే ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి...

హైదరాబాద్‌: ధరలు పెంచి అమ్మితే వెంటనే 040 23447770 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని ఛీఫ్‌ రేషనింగ్‌ అధికారి బాలమాయాదేవి విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ఏర్పాటు చేశామని ప్రకటించారు. లాక్‌డౌన్‌ సాకుతో అదును చూసి ధరలు పెంచితే వర్తకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జైలుకు పంపుతామని హెచ్చించారు. మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. టోకు, చిల్లర వర్తకులకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ నుంచి ఆదేశాలు జారీ చేశామని, నిత్యావరస సరుకుల ధరలు పెంచి అమ్మరాదని తెలిపారు. ప్రజలు ఎక్కువ ధర పెట్టి కొనద్దని ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని అయితేనే మిగితా వ్యాపారులకు భయం ఉంటుందని పిలుపునిచ్చారు. 


logo