శుక్రవారం 29 మే 2020
Telangana - Mar 31, 2020 , 17:16:53

లాక్‌డౌన్‌ను ప్రజలు సరిగా పాటిస్తే వైరస్‌ వ్యాప్తి నివారణ : ఐపీఎం డైరెక్టర్‌

లాక్‌డౌన్‌ను ప్రజలు సరిగా పాటిస్తే వైరస్‌ వ్యాప్తి నివారణ : ఐపీఎం డైరెక్టర్‌

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ను ప్రజలు సరిగా పాటిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించొచ్చని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్స్‌(ఐపీఎం) సంస్థ డైరెక్టర్‌ డా. శంకర్‌ అన్నారు. కరోనా వైరస్‌పై ఆయన స్పందిస్తూ.. కరోనా వైరస్‌ పాతదే అయినా ప్రపంచాన్ని వణికిస్తోందన్నారు. ఇలాంటి అనేక వైరస్‌లను దిగ్విజయంగా ఎదుర్కొన్నామన్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటికే 14 మంది కోలుకున్నారన్నారు. అదేవిధంగా ఇవాళ 13 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతా చర్యలు పాటించాలని సూచించారు. కరోనా మరణాలు సంఖ్య 2 నుంచి 3 శాతమేని తెలిపారు. మరో 15 రోజులు లాక్‌డౌన్‌ పాటిస్తే వ్యాధిని కొంతవరకు అరికట్టొచ్చన్నారు. కరోనాకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, ఫీవర్‌, సీసీఎంబీలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీసీఎంబీలో 800 నుంచి వెయ్యి వరకు పరీక్షలు చేయొచ్చన్నారు.


logo