గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 11:42:57

అప్రమత్తతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట: మంత్రి పువ్వాడ

అప్రమత్తతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట: మంత్రి పువ్వాడ

ఖమ్మం: ప్రజల సహకారంతోనే రోడ్డు భద్రతను పెంపొందించడం సాధ్యమవుతుందని మంత్రి అజయ్‌ కుమార్‌ అన్నారు. ప్రయాణంలో వాహనఛోదకులు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో బైక్‌ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. 


రెండో ప్రపంచయుద్ధంలో మరణించిన వారికంటే ఒక ఏడాదిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువమంది చనిపోతున్నారని చెప్పారు. సమష్టి కృషితో భద్రతా ప్రమాణాలను నిరంతరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో కవిలి నిద్ర నుంచి ఆర్టీవో కార్యాలయం వరకు సాగిన ఈ బైక్‌ ర్యాలీలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo