సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 16, 2020 , 23:38:47

క్యాన్సర్‌ నివారించాలంటే ఇది తీసుకోండి...

క్యాన్సర్‌ నివారించాలంటే ఇది తీసుకోండి...

జలుబు చేసినా, దగ్గు ఉన్నా అల్లం టీ తాగితే ఉపశమనంగా అనిపిస్తుంది. జీర్ణ సమస్యల నివారణిగా కూడా దీనికి పేరుంది.  వికారం, వాంతుల లాంటి లక్షణాలున్నా, ఇన్‌ఫ్లమేషన్‌ లాంటి సమస్యలున్నా అల్లంను వాడుతుంటారు. అండాశయ క్యాన్సర్‌ కణాలతో పోరాడే గుణాలు కూడా అల్లంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇప్పుడు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నివారణలో కూడా అల్లం తోడ్పడుతుందని ఇటీవలే వెల్లడైంది. అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ పరిశోధనలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అల్లం పొడిని చికిత్సలో భాగంగా వాడడం వల్ల క్యాన్సర్‌ కణాలు వాటికవే చనిపోతున్నట్టు గతంలోనే కనుగొన్నారు. దీన్నే వైద్యపరిభాషలో అపాప్టోసిస్‌గా వ్యవహరిస్తారు. ఈ క్యాన్సర్‌ కణం పక్కనున్న క్యాన్సర్‌ కణంపై కూడా దాడిచేస్తున్నట్టు (ఆటోఫేజీ) పరిశోధకులు గమనించారు. 

అండాశయ క్యాన్సర్‌ కణాల్లో ఆంజియోజెనిక్‌ కారకాలను విడుదల చేయడం ద్వారా వాటి పెరుగుదలను అల్లం నిరోధిస్తుంది. అందువల్ల అండాశయ క్యాన్సర్‌  చికిత్సలో ఇది కీలకపాత్ర వహిస్తుంది. ఇక ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ విషయానికి వస్తే అల్లంలో ఉండే జింజిబర్‌ ఆఫిసినేల్‌ ప్రొస్టేట్‌ గ్రంథిలోని ఆరోగ్యకరమైన కణాలను ఏమీ చేయకుండా కేవలం క్యాన్సర్‌ కణాలను మాత్రమే చంపేస్తున్నదని ఈ అమెరికన్‌ పరిశోధనలో తేలింది. అలా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కణితి పరిమాణాన్ని 56 శాతం తగ్గించిందినట్టు గమనించారు. ఈ పరిశోధనాంశాలు బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూటిషన్‌లో ప్రచురితమయ్యాయి. కీమోథెరపీ, రేడియేషన్‌ చికిత్సలు తీసుకుంటున్నవాళ్లు అల్లం తీసుకుంటే త్వరగా కోలుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. logo