శనివారం 04 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 12:40:23

ప్రారంభానికి సిద్ధమైన భద్రకాళీబండ్‌... వీడియో

ప్రారంభానికి సిద్ధమైన భద్రకాళీబండ్‌... వీడియో

హైదరాబాద్‌: వరంగల్‌కు మణిహారంగా మారిన భద్రకాళీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హృదయ్‌ పథకంలో భాగంగా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భద్రకాళీ బండ్‌ను సరికొత్తగా తీర్చిద్దింది. కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా రాతి కట్టడాలతో ఆకర్షనీయంగా నిర్మించారు. నగరవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బండ్‌పై నడక సాగించేందుకు ప్రత్యేకంగా సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌, వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేశారు. మొదటి దశలో రూ.21 కోట్ల వ్యయంతో, రెండో దశలో రూ.66 కోట్ల వ్యయంతో నిర్మాణాలను చేపట్టారు. చారిత్రకనగరంగా భాసిల్లే ఓరుగల్లుకు మరో ఆకర్షణగా నిలవనున్న భద్రకాళీ బండ్‌ను మంత్రి కేటీఆర్‌ త్వరలో ప్రారంభించనున్నారు. 



logo