శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:15:32

రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి

రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి

  • గవర్నర్‌ తమిళిసైతో ఫోన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రజలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆకాంక్షించినట్టు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలిపారు. ఈ నెల7న జరిగే జాతీయ విద్యా విధానం-2020పై నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్రపతి తనతో ఫోన్‌లో మాట్లాడినట్టు గవర్నర్‌ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అన్ని రాష్ర్టాల గవర్నర్లు, విద్యాశాఖ మంత్రులతో రాష్ట్రపతి మాట్లాడుతారని పేర్కొన్నారు.


logo