బుధవారం 15 జూలై 2020
Telangana - Apr 03, 2020 , 19:21:17

గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌

గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: రాష్ర్టాల, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌, ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలును గవర్నర్‌ తమిళసై వారికి నివేదించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,364 మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఇంకా 7,222 మంది ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2400 నమూనాలు పరీక్షించారు. ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో 925 మందిని గుర్తించారు. అందులో 79 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలోని 31 ఆస్పత్రుల్లో 12,500 పడకలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి గవర్నర్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. 


logo