శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 24, 2020 , 15:19:57

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత

 కుమ్రంభీం అసిఫాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెలంగాణ సర్కార్‌ భరోసా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో అండగా ఉంటుందని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల కల్యాణానికి ప్రభుత్వం కల్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తూ వారి కుటుంబాల్లో భరోసా నింపుతుందన్నారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.